Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. కారుపైకి దూసుకెళ్లిన లారీ.. అక్కడికక్కడే ఐదుగురు దుర్మరణం

Five people died in a road accident at Guvvalacheruvu in Kadapa  telugu news
x

 Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. కారుపైకి దూసుకెళ్లిన లారీ.. అక్కడికక్కడే ఐదుగురు దుర్మరణం

Highlights

Road Accident: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. సీకే దిన్నె మండలం గువ్వలచెరువ ఘాట్ రోడ్డు వద్ద...

Road Accident: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. సీకే దిన్నె మండలం గువ్వలచెరువ ఘాట్ రోడ్డు వద్ద లారీ, కారు ఢీకున్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరణించిన వారిలో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. డెడ్ బాడీలను పోస్టు మార్టం నిమ్మిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితులు రాయచోటి నుంచి కడప వస్తున్న క్రమంలో గువ్వల చెరువు ఘాట్ మూలమలుపు దగ్గర కారుపైకి లారీ దూసుకెళ్లినట్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories