Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం - ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి

Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం - ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి
x
Highlights

Road Accident: తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఐదుగురు అయ్యప్ప భక్తులు దుర్మరణం చెందారు.

Road Accident: తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఐదుగురు అయ్యప్ప భక్తులు దుర్మరణం చెందారు. రెండు కార్లు పరస్పరం ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

రామేశ్వరం ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్తున్న అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న వాహనాలకు ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారుగా గుర్తించారు.

ఈ ఘటనలో మరో ఏడుగురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories