నడిసముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు.. చివరకు..

నడిసముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు.. చివరకు..
x
Highlights

నడిసంద్రంలో బోటు ఇంజిన్‌ పాడవడంతో ఏడుగురు మత్స్యకారులు నది సముద్రంలో చిక్కుకుపోయారు. ఈ ఘటన కాకినాడ లోని సముద్రంలో జరిగింది..

నడిసంద్రంలో బోటు ఇంజిన్‌ పాడవడంతో ఏడుగురు మత్స్యకారులు నది సముద్రంలో చిక్కుకుపోయారు. ఈ ఘటన కాకినాడ లోని సముద్రంలో జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రాంతానికి చెందిన మత్స్యకారులు ఈ నెల 7వ తేదీన సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. వారిలో మైలిపల్లి సింగరాజు, గుంటి దుర్గ, గరికిన యల్లాజీ, పేర్ల రాంబాబు, గుంటి పోలయ్య, కారె సింహాద్రి, పేర్ల తాతారావు లు ఉన్నారు. సముద్రంలోకి వెళ్ళాక బోటుతో కొత్తపాలెంలోని ఆయిల్‌ రిగ్‌ వద్ద లంగరు వేసి చేపలు వేటాడుతున్నారు. అయితే ఈ నెల 10న వాయుగుండం కారణంగా గాలివాన ఎక్కువ అయింది. దాంతో వెనక్కి వచ్చేందుకు ప్రయత్నించగా ఆ బోటు ఇంజన్ లోపంతో పనిచేయలేదు..

డ్రైవర్ ఎంత ప్రయత్నించినా బోటు ముందుకు కదలలేదు.. సాయంకోసం ఎదురుచూశారు.. ఈ క్రమంలో తెచ్చుకున్న తిండిగింజలు కాస్త అయిపోయాయి. రెండు రోజులు ఎదురు చూసినా ఎవరూ రాకపోవడంతో సముద్రంలో దిక్కులేక ప్రాణాలపై ఆశలు వదులుకున్నారు. ఆ స్థితిలో ఉన్న వారికి బోటుకు ఉన్న తెరచాపే దిక్కైంది. అదే వారిని ఒడ్డుకు చేర్చింది. శుక్రవారం ప్రకాశం జిల్లా చీరాల వాడరేవుకు మత్స్యకారులు చేరుకున్నారు. దీంతో ఆందోళన ఉన్న కుటుంబసభ్యులు ఎంతో సంతోషించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories