AP Panchayat Elections: తొలి దశ ఎన్నికలు జరిగే మండలాలివే..నామినేషన్లకు సర్వం సిద్ధం

AP Panchayat Elections: తొలి దశ ఎన్నికలు జరిగే మండలాలివే..నామినేషన్లకు సర్వం సిద్ధం
x
Highlights

ఏపీ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్థమైంది. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కాబోంతుంది.

ఏపీ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్థమైంది. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కాబోంతుంది. మొత్తం నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశలో మొత్తం 175 మండలాల్లో ఎన్నికలలు జరగనున్నాయి. దాదాపు నాలుగు వేల గ్రామాల్లో ఓటర్లు ఓట్లు వేయనున్నారు. రేపటి నుంచి తొలి విడత ఎన్నికల నామినేషన్లు స్వీకరించనున్నారు. విజయనగరం జిల్లాలో మూడో విడతలో, ప్రకాశం జిల్లాలో రెండో విడతలో పంచాయతీ ఎన్నికలు ప్రారంభమవుతాయి.

ఈనెల 31తో నామినేషన్ల దాఖలుకు గడువు పూర్తికానుంది. ఫిబ్రవరి 1న నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 2న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తారు. ఫిబ్రవరి 3న అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఫిబ్రవరి 4న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తుంది. ఫిబ్రవరి 9న ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పోలిగం ప్రక్రియ కొనసాగుతుంది. అదే రోజు సాయంత్రం 4గంటల నుంచి పోలైన ఓట్లను లెక్కిస్తారు.. సాయంత్రం 7గంటల లోపు ఫలితాలు ప్రకటిస్తారు. తొలి దశలో విజయనగరం మినహా మిగిలిన 11 జిల్లాల్లో ఎన్నికలు ఉంటాయి.

అనంతపురం: కదిరి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న అమడగూరు, బుక్కపట్నం, గాండ్లపెంట, కదిరి, కొత్తచెరువు, ఎన్.పి.కుంట, నల్లమడ, ఓదులదేవర చెరువు, పుట్టపర్తి, తలుపుల, తనకల్లు మండలాలు

కడప : జమ్మలమడుగు, కడప, రాజంపేట రెవెన్యూ డివిజన్ల పరిధిలోని చాపాడు, మైదుకూరు, దువ్వూరు, ప్రొద్దుటూరు, రాజుపాలెం, ఖాజీపేట, బద్వేలు, అట్లూరు, బి.కోడూరు, గోపవరం, పారుమామిళ్ల, ఎస్.ఎ.కే.ఎన్ పాడు, కలసపాడు, బి.మఠం మండలాలు

కర్నూలు: నంద్యాల, కర్నూలు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఆళ్లగడ్డ, చాగలమర్రి, దోర్నిపాడు, రుద్రవరం, సిరివెళ్ల, ఉయ్యాలవాడ, గోస్పాడు, నంద్యాల, బండి ఆత్మకూరు, మహానంది, ఆత్మకూరు, వెలుగోడు మండలాలు

చిత్తూరు : చిత్తూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న బంగారుపాళ్యం, చిత్తూరు, గంగాధర నెల్లూరు, గుడిపాల, ఐరాల, కార్వేటినగరం, నగరి, నారాయణవనం, నిండ్ర, పాలసముద్రం, పెనుమూరు, పూతలపట్టు, పుత్తూరు, అర్.సీ.పురం, ఎస్.ఆర్ పురం, తవణంపల్లి, వడమాలపేట, వెదురుకుప్పం, విజయపురం, యడమారి మండలాలు

ప్రకాశం: ఒంగోలు రెవెన్యూ డివిజన్ పరిధిలోని అద్దంకి, బల్లికురవ, చీమకుర్తి, చినగంజాం, చీరాల, ఇంకొల్లు, జె.పంగులరు, కారంచేడు, కొరిశపాడు, కొత్తపట్నం, మార్టూరు, మద్దిపాడు, ఎస్.జీ పాడు, ఒంగోలు, పర్చూరు, సంతమాగులూరు, సంతనూతలపాడు, వేటపాలెం, టంగుటూరు, యద్దనపూడి మండలాలు

నెల్లూరు: కావలి రెవెన్యూ డివిజన్ పరిధిలోని అల్లూరు, బోగోలు, దగదర్తి, దత్తలూరు, జలదంకి, కలిగిరి, కావలి, కొండాపురం, వరికుంటపాడు మండలాలు

గుంటూరు : తెనాలి రెవెన్యూ డివిజన్ లోని అమర్తలూరు, బాపట్ల, భట్టిప్రోలు, చేబ్రోలు, చెరుకుపల్లి, దుగ్గిరాల, కాకుమాను, కర్లపాలెం, కొల్లిపరం, కొల్లూరు, నగరం, నిజాంపట్నం, పి.వీ పాలెం, పొన్నూరు, తెనాలి, రేపల్లె, టి.చుండూరు, వేమూరు మండలాలు

కృష్ణా: విజయవాడ రెవెన్యూ డివిజన్ పరిధిలోని చందర్లపాడు, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కంచికచర్ల, కంకిపాడు, మైలవరం, నందిగామ, పెనుగంచిప్రోలు, పెనమలూరు, తోట్లవల్లూరు, వత్సవాయి, వీరుళ్లపాడు, విజయవాడ రూరల్ మండలాలు

పశ్చిమగోదావరి : నర్సాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆకివీడు, భీమవరం, ఆచంట, కాళ్ల, మొగల్తూరు, నర్సాపురం, పాలకోడేరు, పాలకొల్లు, పోడూరు, ఉండి, వీరవాసరం, యలమంచిలి మండలాలు

తూర్పు గోదావరి : కాకినాడ, పెద్దాపురం రెవెన్యూ డివిజన్ల పరిధిలోని గొల్లప్రోలు, కాకినాడ రూరల్, కరప, పెదపూడి, పిఠాపురం, సామర్లకోట, తాళ్లరేవు, యు.కొత్తపల్లి, గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి, కోటనందూరు, పెద్దాపురం, ప్రత్తిపాడు, రంగంపేట, రౌతలపూడి, శంఖవరం, తొండగి, తుని, ఏలేశ్వరం మండలాలు

విశాఖపట్నం : అనకాపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని అచ్యుతాపురం, అనకాపల్లి, చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు, కశింకోట, వి.మాడుగుల, మునగపాక, రాంబిల్లి, యలమంచిలి, బుచ్చియ్యపేట, చోడవరం

శ్రీకాకుళం : శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న ఎల్.ఎన్.పేట, లావేరు, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, నందిగాం కొత్తూరు, హిరమండలం, పాతపట్నం, మెళియాపుట్టి మండలాలు

Show Full Article
Print Article
Next Story
More Stories