hmtv చేతిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మొదటి లిస్ట్‌.. తూర్పులో నలుగురు సిట్టింగ్‌లకు నో టికెట్‌..

First List of YSRCP Candidates With HMTV
x

hmtv చేతిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మొదటి లిస్ట్‌.. తూర్పులో నలుగురు సిట్టింగ్‌లకు నో టికెట్‌..

Highlights

YSRCP MLA Candidates: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల వ్యూహ రచనలో వైసీపీ అధినేత దూకుడు పెంచారు.

YSRCP MLA Candidates: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల వ్యూహ రచనలో వైసీపీ అధినేత దూకుడు పెంచారు. అందరికంటే ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసి ప్రచారంలో దూసుకుపోవాలని ప్రణాళిక రచిస్తున్నారు. తాడేపల్లి క్యాంప్‌ ఆపీస్‌ వేదికగా భవిష్యత్‌ కార్యాచరణను రచిస్తున్నారు. దీంట్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాలకు ఇన్‌చార్జిలను ప్రకటించనున్నారు. అదే అభ్యర్థుల జాబితాగా మారనుంది. అయితే వైసీపీ విడుదల చేయనున్న వైసీపీ అభ్యర్థుల తొలిజాబితా HMTV చేతికి చిక్కింది.

ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన ఇన్‌చార్జిలను జగన్‌ కాసేపట్లో ప్రకటించనున్నారు. ఇదే అసెంబ్లీ అభ్యర్థుల తుది జాబితా..వీరిలో కొందరు ఎంపీలకు ఎమ్మెల్యే టిక్కెట్లు, కొందరు ఎమ్మెల్యేలకు స్థాన చలనం జరిగింది. మరికొంత మంది సిట్టింగ్‌లకు టిక్కెట్‌ దక్కలేదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు సిట్టింగ్‌లకు ఈసారి టికెట్లు లేనట్టే అని తేలిపోయింది.

జ్యోతుల చంటిబాబు, పర్వత ప్రసాద్‌, పెండెం దొరబాబు, కొండేటి చిట్టిబాబులకు ఈసారి టిక్కెట్లు దక్కలేదు.. మంత్రి విశ్వరూప్‌ స్థానంలో అతని కుమారుడు పినిపె శ్రీకాంత్‌కు టిక్కెట్‌ ఖరారయ్యింది. ఎంపీలు మార్గాని భరత్‌, వంగా గీతలు అసెంబ్లీ బరిలో దిగనున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఒక సిట్టింగ్‌కు టిక్కెట్‌ దక్కలేదు. పోలవరం ఎమ్మెల్యేకు బదులుగా ఆయన భార్య రాజ్యలక్ష్మికి టికెట్‌ కేటాయించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రుల స్థానాలు మారలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories