Delta Plus Variant: ఏపీలో ఫస్ట్ డెల్టా ప్లస్ వేరియంట్ కేసు నమోదు

Delta Plus Variant: ఏపీలో డెల్టా ప్లస్ వేరియంట్ ఫస్ట్ కేసు నమోదయినట్లు మంత్రి ఆళ్ల నాని తెలిపారు.

Arun Chilukuri
Published on: 25 Jun 2021 3:16 PM IST
First Delta Plus Variant Case Reported in Tirupati
X

ఆళ్ల నాని(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

Delta Plus Variant: ఏపీలో డెల్టా ప్లస్ వేరియంట్ ఫస్ట్ కేసు నమోదయినట్లు మంత్రి ఆళ్ల నాని తెలిపారు. తిరుపతిలో తొలికేసు నమోదయినట్లు గుర్తించామన్న మంత్రి బాధితుడి నుంచి వైరస్ వ్యాప్తి జరగలేదని స్పష్టం చేశారు. డెల్టా ప్లస్ వేరియంట్ సోకిన వ్యక్తికి ట్రీట్‌మెంట్ పూర్తయిందన్న మంత్రి అతడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు వెల్లడించారు. అలాగే, రానున్న రోజుల్లో థర్డ్‌వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించినట్లు ఆళ్ల నాని తెలిపారు.

మరోవైపు డెల్టా ప్లస్, బ్లాక్ ఫంగస్‌కు సంబంధించి అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. అలాగే, రాష్ట్రంలో లాక్‌డౌన్ ఉంచాలా, లేక మరిన్ని సడలింపులు ఇవ్వాలా అన్నదానిపై మాత్రం అప్పటి పరిస్థితులనుబట్టి తదుపరి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story