వాగులో చిక్కుకున్న బాలుడు..సురక్షితంగా కాపాడిన ఫైర్ సిబ్బంది

వాగులో చిక్కుకున్న బాలుడు..సురక్షితంగా కాపాడిన ఫైర్ సిబ్బంది
x
Highlights

తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం సుద్దగడ్డ వాగులో చిక్కుకున్న బాలుడిని ఫైర్ సిబ్బంది సురక్షితంగా కాపాడారు. మేకకు మేత కోసం వెళ్లిన బాలుడు పక్కనే...

తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం సుద్దగడ్డ వాగులో చిక్కుకున్న బాలుడిని ఫైర్ సిబ్బంది సురక్షితంగా కాపాడారు. మేకకు మేత కోసం వెళ్లిన బాలుడు పక్కనే ఉన్న వాగులో పడిపోయాడు. వరద ఉధృతి అధికంగా ఉండటంతో అక్కడే ఉన్న వెదురు చెట్టును పట్టుకుని ప్రాణాలు నిలబెట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న స్ధానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బందిని రంగంలోకి దింపారు. ట్యూబ్‌,తాళ్ల సాయంతో బాలుడిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories