Top
logo

తూర్పు గోదావరి జిల్లాలో అగ్నిప్రమాదానికి గురైన రైలు

తూర్పు గోదావరి జిల్లాలో అగ్నిప్రమాదానికి గురైన రైలు
X
Highlights

యశ్వంత్‌పూర్‌-టాటానగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో పెను ప్రమాదం తప్పింది. బోగీలో(ప్యాంట్రీ కార్‌) మంగళవారం...

యశ్వంత్‌పూర్‌-టాటానగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో పెను ప్రమాదం తప్పింది. బోగీలో(ప్యాంట్రీ కార్‌) మంగళవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు రైల్వేస్టేషన్‌ సమీపంలో చోటుచేసుకుంది. మంటలు చెలరేగడంతో రైలులోని వంటగది తగలబడింది. దీంతో ప్రయాణికులు వెంటనే చైన్‌ లాగి రైలును నిలిపివేశారు. ఇంతలో సిబ్బంది ఫైర్ ఇంజన్ కు ఫోన్ చేశారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందడంతో రెండు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

ఈ ఘటనలో ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా బయడపడ్డారు. అగ్నిప్రమాదం జరగడంతో ఐదు గంటలు పాటు రైలు పట్టాలపైనే నిలిచిపోయింది. ప్రస్తుతం ఒకే లైన్‌ ద్వారా రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి. దీంతో విజయవాడ-విశాఖపట్నం మద్య రైళ్లు ఐదు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

Next Story