Minister Buggana: పరిమితికి మించి అప్పులు చేయడం లేదు
* ప్రభుత్వంపై పతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయి * టీడీపీ హయంలో చేసిన అప్పుల భారం మోస్తున్నాం-బుగ్గన
ఏపీ ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (ఫోటో ది హన్స్ ఇండియా)
Buggana Rajendranath Reddy: రాష్ర్టాభివృద్ధి కోసం చేసిన అప్పులపై ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని ఏపీ ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. కరోనా కష్టకాలంలో ఆర్ధిక పరిస్థితి దెబ్బతిన్నదని ప్రభుత్వ రాబడులు భారీగా తగ్గిందని చెప్పారు. అయినా కరోనా కట్టడికి ప్రభుత్వం ఏడు వేల కోట్లకు పైగా ఖర్చు చేసిందన్నారు. దేశం మొత్తం ఇదే పరిస్థితి ఉందన్నారు. టీడీపీ హాయంలో విచ్చలవిడిగా చేసిన అప్పుల భారాన్ని ప్రస్తుతం మోస్తున్నామన్నారు. పిల్లల చదువుకు, వృద్ధుల పెన్షన్ కోసం అప్పు చేయడం తప్పా అని ప్రశ్నించారు.
Next Story




