YCP: రేపు వైసీపీ ఇంఛార్జ్‌ల తుది జాబితా..!

YCP: అసెంబ్లీ, ఎంపీ స్థానాల ఫైనల్ లిస్ట్‌పై కొనసాగుతున్న కసరత్తు

Jyothi
Published on: 8 Jan 2024 11:27 AM IST
Final List of YCP In-charge Tomorrow
X

YCP: రేపు వైసీపీ ఇంఛార్జ్‌ల తుది జాబితా..!

YCP: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే... జిల్లాలకు వైసీపీ హైకమాండ్ ఇంఛార్జ్‌లను నియమిస్తుంది. రేపు వైసీపీ ఇంఛార్జ్‌ల తుది జాబితా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ, ఎంపీ స్థానాల ఫైనల్ లిస్ట్‌పై కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే మొదటి లిస్ట్‌లో 11, రెండో లిస్ట్‌లో 27 మంది ఇంఛార్జ్‌లను ప్రకటించారు. మరో 10 నుంచి 15 అసెంబ్లీ స్థానాలకు ఇంఛార్జ్‌ల మార్పుపై దృష్టి సారించింది.

ఇప్పటికే ఆయా స్థానాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో వైసీపీ పెద్దలు మాట్లాడినట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాలు, గెలుపు గుర్రాలకు టికెట్లు ఇచ్చేలా కసరత్తు చేస్తున్నారు. ఇక ఏలూరు, గుంటూరు, కర్నూల్ ఎంపీ స్థానాలతో పాటు.. శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలు అసెంబ్లీ స్థానాలపై కసరత్తు చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story