నేడు ఏపీలో సినిమా టికెట్ల కమిటీ నివేదికపై తుది చర్చలు

Andhra Pradesh: నిన్న సీఎం జగన్ తో సమావేశమైన మంత్రి పేర్ని నాని, సినిమా టికెట్ల ధరలపై చర్చించిన పేర్నినాని.

Sriveni Erugu
Published on: 9 Feb 2022 8:48 AM IST
Final discussions on the Movie Tickets Committee report on the AP Today
X

నేడు ఏపీలో సినిమా టికెట్ల కమిటీ నివేదికపై తుది చర్చలు

Andhra Pradesh: ఏపీలో సినిమా టికెట్ల కమిటీ నివేదికపై నేడు తుది చర్చలు జరగనున్నాయి. నిన్న సీఎం జగన్‌తో సమావేశమైన మంత్రి పేర్నినాని, సుదీర్ఘంగా సినిమా టికెట్ల ధరలపై చర్చించారు. అయితే ఇవాళ మరోసారి ఇద్దరు భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్, మంత్రి పేర్నినాని మరోసారి సమావేశమయ్యే అవకాశం కన్పిస్తోంది. ఇప్పటికే ప్రాంతాలవారీగా ధరలపై కమిటీ ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. ఇక రేపు సీఎం జగన్ తో చిరంజీవి, ట్రిపుల్ ఆర్‌, రాధ్యేశామ్ నిర్మాతలు సమావేశం కానున్నారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story