విజయవాడలో వైసీపీ ఎమ్మెల్యేల మధ్య రగడ

Fight Erupts Between Vijayawada YSRCP Leaders
x

విజయవాడలో వైసీపీ ఎమ్మెల్యేల మధ్య రగడ

Highlights

Vijayawada: విజయవాడలో వైసీపీ ఎమ్మెల్యేల మధ్య రగడ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Vijayawada: విజయవాడలో వైసీపీ ఎమ్మెల్యేల మధ్య రగడ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యేలు వెల్లంపల్లి, సామినేని ఉదయభాను దూషణలకు దిగారు. వైసీపీ నగర అధ్యక్షులు బొప్పన భవనకుమార్ పుట్టినరోజు వేదికగా ఈ ఘటన జరిగింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆకుల శ్రీనివాస్‌ను సీఎం జగన్ వద్దకు ఉదయభాను తీసుకెళ్లారు. దీనిపై వెల్లంపల్లి సీరియస్ అయ్యారు. ఈ సందర్భంగా తన నియోజకవర్గానికి చెందిన ఆకుల శ్రీనివా్‌సను తనకు చెప్పకుండా సీఎం జగన్‌ వద్దకు ఎందుకు తీసుకెళ్లావంటూ ఉదయభానును వెలంపల్లి ప్రశ్నించారు. శ్రీనివా్‌సకు, తనకు కాంగ్రె్‌సలో ఉన్నప్పటి నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, తీసుకెళితే తప్పేంటని సామినేని ఎదురు ప్రశ్నించారు. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. తన నియోజకవర్గ రాజకీయాల్లో తలదూర్చాల్సిన అవసరమేంటని వెలంపల్లి నిలదీయడంతో ''విజయవాడ నీకేమైనా రాసిచ్చారా?'' అని ఉదయభాను ఆగ్రహం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories