Prakasam: గిద్దలూరులో వైసీపీ నేతల బాహాబాహీ

Prakasam: విజయోత్సవ ర్యాలీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

Sandeep Eggoju
Published on: 27 Sept 2021 10:02 AM IST
Fight Between YCP Leaders in Prakasam District
X

వైసీపీ నేతల మధ్య బాహబాహి (ఫైల్ ఇమేజ్)

Prakasam: ప్రకాశం జిల్లా గిద్దలూరులో వైసీపీ విజయోత్సవ ర్యాలీలలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గిద్దలూరు మండలం పొదలకుంట పల్లి గ్రామంలో విజయోత్సవ ర్యాలీలో భాగంగా వైసీపీకి చెందిన ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. జయరాం రెడ్డి వర్గీయులు, మాజీ ఎంపీపీ కడప వంశీధర్ రెడ్డి వర్గీయులు దాడికి పాల్పడ్డారంటూ గిద్దలూరులోని వైఎస్సార్ సెంటర్‌లో ధర్నాకి దిగారు. తక్షణమే మాజీ ఎంపీపీ ప్రస్తుత ఎంపీటీసీ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి ఇరు వర్గాలను నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. పెద్దల సహకారంతోనే ప్రత్యర్ధి వర్గం వారు తమ దాడి చేశారని ఆరోపించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story