Kadapa: పెద్దచెప్పలిలో విద్యా కమిటీ ఎన్నికలో వైసీపీ, టీడీపీ బాహాబాహీ

Kadapa: ఒక్క ఓటు విషయంలో ఇరువర్గాల ఘర్షణ

Sandeep Eggoju
Updated on: 22 Sept 2021 1:08 PM IST
Fight Between YCP and TDP in Education Committee Elections at Kadapa District
X

కడపజిల్లా విద్య కమిటీ ఎన్నికల్లో వైసీపీ టీడీపీ భహ భాహి (ఫైల్ ఇమేజ్)

Kadapa: కడప జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పెద్దచెప్పలి జెడ్పీ హైస్కూల్‌లో విద్యా కమిటీ ఎన్నికలో వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒక్క ఓటు విషయంలో ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. టీడీపీ నాయకులు డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ.. వైసీపీ నేతలు దాడులకు దిగారు.

విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతున్నామని టీడీపీ వారు చెబుతున్నా వినకుండా చేయి చేసుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆందోళనకారులకు సర్ధిచెప్పి గొడవ సద్దుమణిగేలా చేశారు. మరోపక్క విద్యా కమిటీ ఎన్నిక వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు అధికారులు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story