Tirumala: తిరుమలలో మళ్లీ వన్య మృగాల భయం.. కెమెరాకు చిక్కిన చిరుత, ఎలుగుబంటి

Fear Of Wild Animals Again In Tirumala
x

Tirumala: తిరుమలలో మళ్లీ వన్య మృగాల భయం.. కెమెరాకు చిక్కిన చిరుత, ఎలుగుబంటి

Highlights

Tirumala: భక్తులు అలర్ట్‌గా గుంపులు.. గుంపులుగా రావాలని సూచన

Tirumala: తిరుమలలో మరో‌సారి వన్యమృగాల సంచారం కలకలం రేపుతుంది. అలిపిరి కాలిబాట మార్గంలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సమీపంలో వన్య మృగాల‌ కదలికలను గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. చిరుత, ఎలుగుబంటి కదలికలు నమోదు అయినట్లు టీటీడీ అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈనెలలో చిరుత, ఎలుగుబంటి ట్రాప్ కెమెరాలకు చిక్కడంతో అలర్ట్ అయిన అధికారులు వన్యమృగాల సంచారం ప్రాంతంలో స్పెషల్ టీంను ఏర్పాటు చేసింది అటవీశాఖ.

చిరుత సంచార ప్రాంతాన్ని పరిశీలించి.. అక్కడ మరిన్ని ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి.. చిరుత పాదముద్రలు సేకరిస్తున్నారు. ఇటీవల నడకమార్గంలో, ఘట్‌రోడ్డులో చిరుత సంచారం తగ్గుముఖం పట్టడంతో టీటీడీ అటవీశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ మళ్లీ చిరుత, ఎలుగుబంటి సంచారంతో మరోసారి శ్రీవారి భక్తులకు చిరుత భయం పట్టుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories