సహజీవనం తల్లి ప్రాణాలు తీస్తే.. మానత్వం మరిచిపోయిన కిరాతక తండ్రి...

NTR District: సహజీవనం తల్లి ప్రాణాలు తీస్తే....బిడ్డను అనాధను చేసింది.

Arun Chilukuri
Published on: 27 Dec 2022 4:33 PM IST
Father Leaves Motherless Child in Bushes in Andhra Pradesh
X

సహజీవనం తల్లి ప్రాణాలు తీస్తే.. మానత్వం మరిచిపోయిన కిరాతక తండ్రి...

NTR District: సహజీవనం తల్లి ప్రాణాలు తీస్తే....బిడ్డను అనాధను చేసింది. హృదయ విధారకమైన ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. కృష్ణాజిల్లా మచిలీపట్నంకి చెందిన మహ్మద్ షాబాజ్..గుడివాడకు చెందిన దివ్య అనే యువతితో కొంత కాలంగా సహజీవనం చేస్తూ హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. గర్భవతి అయిన దివ్య ఈ నెల 23న ఆడ శిశువుకు జన్మనిచ్చింది. డెలివరీ అనంతరం దివ్యకు మూర్చ రావడతో ఆమెను ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ దివ్య అదే రోజు రాత్రి మృతి చెందింది. అయితే మృత దేహాన్ని స్వగ్రామానికి తరలిస్తుండగా... ఇబ్రహీంపట్నం దొనబండ వద్ద ముళ్లపొదల్లో రెండు రోజుల చిన్నారిని విసిరేశాడు మానత్వం మరిచిపోయిన ఆ కిరాతక తండ్రి. పసికందు ఏడుపును గమనించిన స్థానిక మహిళ చిన్నారిని ఆశా వర్కర్‌కు అప్పగించింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు షాబాజ్‌పై కేసు నమోదు చేసి చిన్నారిని చైల్డ్‌ లైన్‌కు అప్పగించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story