Anantapur: రెండు నెలల చిన్నారిని హత్య చేసిన తండ్రి

Anantapur: చిన్నారిని హత్య చేసి చెరువులో పడేసిన తండ్రి మల్లికార్జున

Sandeep Eggoju
Published on: 22 Oct 2021 1:49 PM IST
Anantapur: రెండు నెలల చిన్నారిని హత్య చేసిన తండ్రి
X

అనంతపురంలో చిన్నారిని హత్య చేసిన తండ్రి 

Anantapur: అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో దారుణం చోటు చేసుకుంది. రెండు నెలల చిన్నారిని కన్న తండ్రి హత్య చేశాడు. చిన్నారిని హత్య చేసి చెరువులో పడేశాడు తండ్రి మల్లికార్జున. రెండు రోజుల క్రితం చిన్నారి, తండ్రి మల్లికార్జున కన్పించకుండాపోయారు. దీంతో మల్లికార్జున భార్య చిట్టెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బృందాలుగా విడిపోయి చిన్నారి, తండ్రి మల్లికార్జున కోసం తీవ్రంగా గాలించారు. చిన్నారిని తండ్రే హత్య చేసి చెరువులో పడేసినట్లు పోలీసులు గుర్తించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story