Farmers Protest: తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో రైతుల ఆందోళన
Farmers Protest: ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు ఇవ్వలేదని ధర్నా
అమలాపురంలో రైతుల నిరసన (ఫైల్ ఇమేజ్)
Farmers Protest: తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వం తమ దగ్గర కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రైతులను అరెస్ట్ చేయగా పోలీసులు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. రెండు నెలలయినా తమకు ధాన్యం డబ్బులు ఇవ్వలేదని ప్రస్తుతం పంట వేయడానికి కూడా డబ్బులు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Next Story




