ప్రముఖ కూచిపూడి న్యత్యకారిణి శోభానాయుడు ఇకలేరు

ప్రముఖ కూచిపూడి న్యత్యకారిణి శోభానాయుడు ఇకలేరు
x
Highlights

ప్రముఖ కూచిపూడి న్యత్యకారిణి శోభానాయుడు మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..

ప్రముఖ కూచిపూడి న్యత్యకారిణి శోభానాయుడు మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి ఒంటి గంట 44 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. 1962లో విశాఖ జిల్లా అనకాపల్లెలో జన్మించిన శోభానాయుడు.. చిన్నవయసులోనే నృత్యకారిణిగా ప్రసిద్ధికెక్కారు. మొదట్లో వెంపటి చిన సత్యం శిష్యురాలుగా అందరికి సుపరిచితమే. వెంపటి నృత్యరూపాలలో అన్ని ప్రధాన పాత్రలనూ పోషించారామె. సత్యభామ, పద్మావతి, చండాలిక పాత్రల్లో ఆమె రాణించారు.

స్వచ్ఛమైన నృత్యరీతి, అంకితభావం ఉన్న నాట్య గురువుగా గుర్తింపు పొందారు.. హైదరాబాదు లోని కూచిపూడి ఆర్ట్ అకాడమీ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తూ.. పిల్లలకు శిక్షణ ఇచ్చారు. నాట్యం వృత్తిగా తీసుకున్న ప్రతిభాశాలి శోభానాయుడు.. తన బహుముఖ ప్రతిభకు నిదర్శనంగా 2001 లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. శోభానాయుడు శిష్యులు పలువురు రాష్ట్ర, జాతీయ పురస్కారాలను కూడా అందుకున్నారు. దేశ విదేశాల్లో సుమారు 15 వందల మందికి కూచిపూడి నృత్యంలో శిక్షణ అందించారు. ఇక శోభానాయుడు మృతిపట్ల పలువురు న్యత్యకారులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories