ఎమ్మెల్యే విడదల రజనీపై సంచలన ఆరోపణలు.. ఓ కుటుంబం సెల్ఫీ వీడియో కలకలం

Vidadala Rajini: చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీపై ఓ కుటుంబం సంచలన ఆరోపణలు చేసింది.

Arun Chilukuri
Published on: 5 Oct 2021 4:56 PM IST
Family Selfie Video on MLA Vidadala Rajini Goes Viral
X

ఎమ్మెల్యే విడదల రజనీపై సంచలన ఆరోపణలు.. ఓ కుటుంబం సెల్ఫీ వీడియో కలకలం

Vidadala Rajini: చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీపై ఓ కుటుంబం సంచలన ఆరోపణలు చేసింది. సీఎం జగన్‌ను ఉద్దేసిస్తూ బాధిత కుటుంబం కీలక వ్యాఖ్యలు చేసింది. యడ్లపాడు మండలం తిమ్మాపూరానికి చెందిన బాధిత కుటుంబం తమపై మూడు నెలల క్రితం హత్యాయత్నం జరిగిందని ఆరోపించింది.

తమపై కొందరు వ్యక్తులు కత్తులతో దాడి చేస్తే ఇప్పటి వరకూ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. విడదల రజనీ గెలుపు కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డామని, కానీ తాము సమస్యలో చిక్కుకుంటే పట్టించుకోవట్లేదని ఆరోపించారు. తమపై దాడికి పాల్పడిన వాళ్లను తక్షణమే అరెస్ట్ చేయాలని సెల్ఫీ వీడియోలో డిమాండ్ చేశారు. లేకపోతే కుటుంబం అంతా కలిసి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story