Fake GO: జీవో ట్యాంపర్‌పై ఏపీ ప్రభుత్వం సీరియస్‌..

* 65ఏళ్లకు పదవీ విరమణ వయస్సు పెంచుతున్నట్లు ప్రచారం

Dhatripriya
Published on: 28 Jan 2023 2:30 PM IST
Fake GO on age limit of government employees in AP
X

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిపై సోషల్‌ మీడియాలో ప్రచారం

Fake GO: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఓ జీవో ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడున్న 62 ఏళ్ల వయసు నుంచి 65 ఏళ్లకు రిటైర్మెంట్ వయసు పెంచారని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అయితే, అలాంటి జీవో ఏదీ ప్రభుత్వం జారీ చేయలేదని అధికారులు వివరణ ఇచ్చారు. పదవీ విరమణ వయసు పెంపు వార్తలు తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. పదవీ విరమణ వయసు పెంచారన్న ప్రచారం ఎలా మొదలైందో నిగ్గుతేల్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు చెప్పారు. దీనిపై గుంటూరు డీఐజీకి ఆర్థిక శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. జీవోను ట్యాంపర్ చేసిన వారిని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు.




Dhatripriya

Dhatripriya

Next Story