విశాఖలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం

Visakha: తాటిచెట్లపాలెం రైల్వే్క్వార్టర్స్‌లోని ఉద్యోగి ఇంటి ఆవరణలో పూజలు

Jyothi
Published on: 18 Dec 2023 1:46 PM IST
Excavations of Hidden Treasures in Visakha District
X

విశాఖలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం

Visakha: విశాఖ జిల్లాలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. ఓ రైల్వే ఉద్యోగి ఇంటి ఆవరణలో పూజలు చేసి తవ్వకాలు చేపట్టినట్లు ప్రచారం జరుగుతోంది. తాటిచెట్లపాలెం రైల్వే క్వార్టర్స్‌లోని సదరు ఉద్యోగి ఇంట్లో పూజలు చేసినట్లు అనుమానిస్తున్నారు. రైల్వే ఉద్యోగి ఆధ్వర్యంలో 20 అడుగుల గొయ్యి తవ్వకాలు చేపట్టినట్లు అనుమానిస్తున్నారు.

అయితే ఈ గుప్త నిధులు తవ్వకాలు చేపట్టేందుకు విజయవాడ నుంచి కొందరు వ్యక్తులు వచ్చినట్లు అనుమానిస్తున్నారు. దీంతో విషయం కాస్త బయటకు పొక్కడంతో ఇంటి గేట్లకు తాళాలు వేసి పారిపోయారు. గుప్త నిధుల లాంటిది ఏమీ లేదనీ.. కేవలం దోష నివారణ కోసం పూజలు చేశామంటూ సదరు వ్యక్తులు తెలిపారు. అయితే సమాచారం తెలుసుకున్న కంచరపాలెం పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story