Somi Reddy: వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ మంత్రి సోమిరెడ్డి
Somi Reddy: సంగం మండలంలోని పొలాల్లో ఉన్న... ధాన్యం రాశులను పరిశీలించిన సోమిరెడ్డి
Somi Reddy: వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ మంత్రి సోమిరెడ్డి
Somi Reddy: రైతు భరోసా కేంద్రాలు కాదు రైతు భక్షక కేంద్రాలని టీడీపి మాజీ మంత్రి సోమిరెడ్డి విమర్శించారు. నెల్లూరు జిల్లా సంగం మండలం తరుణవాయి తలుపూరుపాడు గ్రామాల్లోని పొలాల్లో ఉన్న ధాన్యం రాశులను ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం తరుణవాయి రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించి అధికారులతో మద్దతు ధర గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెండు రోజుల క్రితం పెరమన గ్రామానికి చెందిన కిరణ్ రెడ్డి అనే రైతు ఆత్మహత్యకు ప్రయత్నం చేయడం బాధాకరమన్నారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.
Next Story




