Ex MP Sabbam Hari: కరోనాతో సబ్బం హరి మృతి

Ex MP Sabbam Hari:విశాఖ నేత, సీనియర్ రాజకీయవేత్త సబ్బం హరిని కూడా ఈ మహమ్మారి బలి తీసుకుంది.

Kranthi
Published on: 3 May 2021 2:56 PM IST
Ex MP Sabbam Hari Passed Away Due to Corona Today
X
మాజీ ఎంపీ సబ్బం హరి 

Ex MP Sabbam Hari: కరోనా మహమ్మారి ఎందరో ప్రముఖులను పొట్టన పెట్టుకుంటోంది. విశాఖ నేత, సీనియర్ రాజకీయవేత్త సబ్బం హరిని కూడా ఈ మహమ్మారి బలి తీసుకుంది. ఆయన్ని కాపాడుకోవడానికి వారి కుటుంబ సభ్యులు విశ్వ ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. ఇటీవల జరిగిన విశాఖ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు.

వివరాల్లోకి వెళితే... కరోనా బారినపడ్డ ఆయన విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజుల నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కొద్ది రోజుల కిందట సబ్బం హరి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అందులో ఆయన కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. అయితే వైద్యుల సూచన మేరకు తొలుత ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. అయినా ఆరోగ్యం మెరుగుపడలేదు మరింత విషమంగా మారింది. వెంటనే ఆరిలోవలో ఉన్న అపోలో ఆస్పత్రిలో చేరారు.

గ‌త మూడు రోజులుగా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న సబ్బం హరి ఆరోగ్యం నేడు విషమించినట్టు వైద్యులు తెలిపారు. కరోనాతో పాటు ఇతర ఇన్‌ఫెక్షన్లు కూడా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వెంటిలేటర్ పై చికిత్స అందించినా లాభం లేకపోయింది. ఆయన చికిత్స పొందుతూనే నేడు తుది శ్వాస విడిచారు.

Kranthi

Kranthi

Next Story