Somireddy Chandramohan Reddy Praises Sonu Sood: నేనైతే ఇక మిమ్మల్ని విలన్ గా చూడలేను.. సోనూసూద్ పై ఏపీ మాజీ మంత్రి ట్వీట్!

Somireddy Chandramohan Reddy Praises Sonu Sood: కష్టం ఎక్కడుంటే నటుడు సోనూసూద్ అక్కడ ఉంటున్నాడు. తాజాగా చిత్తూరు జిల్లాకు చెందిన రైతు కుటుంబ కష్టాలను తెలుసుకొని
Somireddy Chandramohan Reddy Praises Sonu Sood: కష్టం ఎక్కడుంటే నటుడు సోనూసూద్ అక్కడ ఉంటున్నాడు. తాజాగా చిత్తూరు జిల్లాకు చెందిన రైతు కుటుంబ కష్టాలను తెలుసుకొని కొన్ని గంటల్లోనే అతని సమస్యను పరిష్కరించారు సోనూసూద్ .. దీనితో సోనూసూద్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమ్రోగుతుంది. తాజాగా సోనూసూద్ చేసిన సహాయానికి గాను ఏపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.
.@SonuSood నేనైతే ఇక మిమ్మల్ని విలన్ గా చూడలేను.సినిమాల్లో మీరు హీరో పాత్ర వేయాల్సిందే.టాటా,మహీంద్ర,ఇన్ఫోసిస్ వంటి సంస్థల దాతృత్వాలు చూశాం.ఒక వ్యక్తికి ఇంత పెద్ద హృదయం ఉంటుందని ఊహించలేదు.వలస కూలీలకు సాయం, మదనపల్లి రైతుకు ట్రాక్టర్,విద్యార్థులు స్వదేశం రావడంలో మీ చొరవ అభినందనీయం pic.twitter.com/Tbek17T6D1
— Somireddy Chandra Mohan Reddy (@Somireddycm) July 27, 2020
"నేనైతే ఇక మిమ్మల్ని విలన్ గా చూడలేను.సినిమాల్లో మీరు హీరో పాత్ర వేయాల్సిందే.టాటా,మహీంద్ర,ఇన్ఫోసిస్ వంటి సంస్థల దాతృత్వాలు చూశాం.ఒక వ్యక్తికి ఇంత పెద్ద హృదయం ఉంటుందని ఊహించలేదు.వలస కూలీలకు సాయం, మదనపల్లి రైతుకు ట్రాక్టర్,విద్యార్థులు స్వదేశం రావడంలో మీ చొరవ అభినందనీయం" అంటూ ట్వీట్ చేశారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు జిల్లాకు మహల్ రాజపల్లిలో రైతు నాగేశ్వరరావు తన కుమార్తెలతో పొలం దున్నిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది కాస్తా సోనూసూద్ దృష్టికి వచ్చింది. దీనితో ముందుగా సోనూసూద్ రేపు ఉదయానికల్లా ఎద్దులు కొనిస్తానని అని ట్వీట్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే ఎద్దులు కాదు ట్రాక్టర్ కొనిస్తానని హామీ ఇచ్చాడు. ఇచ్చినట్టుగానే కొద్ది గంటల్లోనే చిత్తూరు జిల్లా మదనపల్లెలో ట్రాక్టర్ ని బుక్ చేశాడు. దీంతో షోరూమ్ వాళ్ళు రైతు నాగేశ్వరరావుకు ఆదివారం సాయంత్రం ట్రాక్టర్‌ను అందజేశారు.
సోనూసూద్ చేసిన సహాయానికి వారు సదరు రైతు కుటుంబం ధన్యవాదాలు తెలిపింది. ఇక సదరు రైతును చదువులపై దృష్టి సారించాలని సోనుసూద్ కోరాడు. ఒక దీనిపైన నెటిజన్లు స్పందిస్తూ 'సోనూది గొప్ప మనసు' అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత
28 Jun 2022 7:36 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTబాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMT
మన్యాన్ని వణికిస్తున్న సీజనల్ వ్యాధులు
29 Jun 2022 2:46 AM GMTవ్యవసాయ సీజన్ మొదలైనా నైరాశ్యంలో రైతన్న
29 Jun 2022 2:08 AM GMTONGC Helicopter Crash: ఓఎన్జీసీకి చెందిన హెలికాప్టర్‌కు ప్రమాదం
29 Jun 2022 1:29 AM GMTMeena Husband Death: నటి మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం
29 Jun 2022 1:16 AM GMTAmarnath Yatra 2022: అమర్నాథ్ యాత్రకు ఏర్పాట్లు ముమ్మరం
29 Jun 2022 1:06 AM GMT