Paritala Sunitha's Father passed away: మాజీ మంత్రి పరిటాల సునీతకు పితృవియోగం!

Paritala Sunitha's Father passed away: టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. పరిటాల సునీత తండ్రి ధర్మవరపు కొండన్న శనివారం

Krishna
Published on: 25 July 2020 2:21 PM IST
Paritala Sunithas Father passed away: మాజీ మంత్రి పరిటాల సునీతకు పితృవియోగం!
X
EX Minister paritala sunitha father kondanna passed away

Paritala Sunitha's Father passed away: టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. పరిటాల సునీత తండ్రి ధర్మవరపు కొండన్న శనివారం ఉదయం కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అయన ఓ ప్రైవేట ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారు. అయన మరణంతో పరిటాల సునీత కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మాజీ మంత్రి పరిటాల రవీంద్ర మరణం తర్వాత ఆ కుటుంబానికి కొండన్న పెద్ద దిక్కుగా ఉంటూ వస్తున్నారు. అయన మరణం పట్ల ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జాతీయ కార్యదర్శి లోకేష్ పలువురు టీడీపీ నేతలు పరిటాల కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తున్నారు.

"టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత గారి తండ్రి శ్రీ కొండన్న గారు మృతి చెంద‌టం బాధాక‌రం. సునీత గారి కుటుంబానికి కొండంత అండ‌గా నిలిచిన కొండ‌న్న గారి మరణం ప‌రిటాల కుటుంబానికి తీర‌నిలోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, సునీత గారి కుటుంబ‌స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ‌ సానుభూతి తెలియ‌జేస్తున్నాను." అని లోకేష్ ట్వీట్ చేశారు . అనంతపురంలోని నసనకోట ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ చైర్మన్‌గా కొండన్న సుదీర్ఘ కాలం పని చేశారు. ఇది అనంతపురం జిల్లాలో అత్యధిక భక్తులు సందర్శించే ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయాన్ని అభివృద్ధి వైపు నడిపించడంలో ధర్మవరపు కొండన్న కీలక పాత్ర పోషించారు. ఆలయం పురాతనమైనదేనప్పటికీ పరిటాల కుటుంబం ఆలయ పరిసరాలను మరింతగా అభివృద్ధి చేసింది.




Krishna

Krishna

Next Story