Paritala Sunitha: మాజీ మంత్రి పరిటాల సునీత దీక్ష భగ్నం

Paritala Sunitha: ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించిన పోలీసులు

Shekhar G
Published on: 26 Sept 2023 10:36 AM IST
Ex-Minister Paritala Sunitha Deeksha Bhagnam
X

Paritala Sunitha: మాజీ మంత్రి పరిటాల సునీత దీక్ష భగ్నం

Paritala Sunitha: చంద్రబాబు అరెస్ట్‌కు సంఘీభావంగా మాజీ మంత్రి పరిటాల సునీత చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసారు. రాప్తాడు నియోజకవర్గం పాపంపల్లి గ్రామపంచాయతీలో మాజీ మంత్రి కార్యకర్తలతో కలిసి నిరాహార దీక్ష చేపట్టారు. ఉదయం 6 గంటల సమయంలో పోలీసులు భారీగా మోహరించి అరెస్టు చేశారు. పోలీసులకు- టీడీపీ నేతలకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

పరిటాల సునీతను శిబిరం వద్ద నుంచి వైద్య పరీక్షల నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తమ నాయకుడు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తాము దీక్షలు చేస్తుంటే అధికార పార్టీ నేతలు తమకొస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక పోలీసులతో అరెస్టు చేయిస్తున్నారంటూ మండిపడ్డారు.

Shekhar G

Shekhar G

Next Story