logo
తెలంగాణ

మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు
X
Highlights

మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనాలకు మంచి చేస్తే మరిచిపోయే అలవాటుందని...

మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనాలకు మంచి చేస్తే మరిచిపోయే అలవాటుందని ఏడాదిపాటు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను రద్దు చేయాలని సీఎం కేసీఆర్ ను కోరాలని ఉందన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో నూతనంగా ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతి వనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మారెడ్డి ఈ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. 24 గంటల ఉచిత కరెంటు కాకుండా కేవలం 3, 4 గంటలు కరెంట్ ఇవ్వాలని కోరుతానన్నారు. తాము చేస్తున్న మేలు సామాన్యులకు అర్ధం కావటం లేదన్నారు. జనం మంచివారనలా అమాయకులనుకోవాలో తెలియడం లేదన్నారు. సంక్షేమ పథకాలను నిలిపి వేసి ఎన్నికలు ఏడాది ఉన్నాయనగా మళ్లీ ప్రారంభిస్తే బాగుంటుందన్నారు.


Web Titleex-minister laxma reddy sensational comments
Next Story