Devineni Uma: ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి దేవినేని ఉమ ఫైర్

Devineni Uma: పోలవరం డ్యామ్‌లో నీళ్లు ఎత్తిపోస్తామంటూ రూ.900 కోట్లు వృధా : దేవినేని

Sandeep Eggoju
Updated on: 23 Jun 2021 9:00 PM IST
Ex-Minister Devineni Uma Fire on Government
X

దేవినేని ఉమా మహేశ్వరరావు (ఫైల్ ఇమేజ్)

Devineni Uma: పోలవరం ప్రాజెక్ట్‌పై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను జగన్ ప్రభుత్వం పోలవరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌గా మార్చేసిందని ఆరోపించారు. పోలవరం డ్యామ్‌లో నీళ్లు ఎత్తిపోస్తామంటూ 900 కోట్లు వృధా చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. ముంపు గ్రామాలను దౌర్జన్యంగా ఖాళీ చేయిస్తున్నారని అన్నారు. సీఎం ఇస్తానన్న రూ.10 లక్షల పరిహారం ఎందుకివ్వలేదంటూ ప్రశ్నించారు. టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ పనులు 71శాతం పూర్తి చేస్తే, జగన్ ప్రభుత్వం రెండేళ్లలో ఏం పనులు చేశారో చెప్పాలని దేవినేని డిమాండ్ చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story