బాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..

Balineni Srinivasa Reddy: వారికి అవకాశం ఇస్తున్న.. ఇకనైన మారండి

Rama Rao
Updated on: 27 Jun 2022 8:10 PM IST
Ex Minister Balineni Srinivasa Reddy Comments on TDP And YCP Leaders
X

Balineni Srinivasa Reddy: టీడీపీ, వైసీపీ నేతలు కలిసి కుట్రలు చేస్తున్నారు

Balineni Srinivasa Reddy: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై వైసీపీ, టీడీపీ నేతలు కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి సంఘటనలో తనపై బురుద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. దీని వెనకాల ఎవరున్నారో తనకు తెలుసన్నారు.

రాజకీయంగా తనను ఎదుర్కొలేకనే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై జరుగుతున్న కుట్రలను త్వరలోనే సీఎం దృష్టికి తీసుకువెళ్తానన్నారు. తనపై చేస్తున్న ఆరోపణల్లో ఒక్కటి రుజువైనా రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ చేశారు. టీడీపీ నేత దామచర్ల జనార్ధన్ వ్యవహారాన్ని త్వరలో బయటపెడతాన్నారు.


Rama Rao

Rama Rao

Next Story