మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డికి షాక్... వైసీపీలోకి సోదరులు ?

మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డికి షాక్... వైసీపీలోకి సోదరులు ?
x
ఆదినారాయణరెడ్డి
Highlights

ఏపీ సీఎం జగన్‌ సొంత జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తొలి నుండి వైఎస్‌ కుటుంబానికి విధేయులుగా ఉంటూ 2014 ఎన్నికల్లో వైసీపీ నుండి గెలిచి ఆ...

ఏపీ సీఎం జగన్‌ సొంత జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తొలి నుండి వైఎస్‌ కుటుంబానికి విధేయులుగా ఉంటూ 2014 ఎన్నికల్లో వైసీపీ నుండి గెలిచి ఆ తర్వాత టీడీపీలోకి వెళ్లిన ఆది నారాయణరెడ్డి కుటుంబం ఇప్పుడు తిరిగి జగన్‌ వైపు చూస్తోంది.

మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సోదరులు వైసీపీలో చేరడం దాదాపు ఖాయంగా కన్పిస్తోంది. కొద్ది రోజుల క్రితం ఆది నారాయణరెడ్డి బీజేపీలో చేరారు. అయితే ఇప్పుడు ఆయన సోదరులు జగన్‌తో కలిసి నడవాలని భావిస్తున్నారు. అందుకోసం వైసీపీలో చేరేందుకు ఈనెల 23న ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

అయితే అక్కడ టీడీపీ నేత రామసుబ్బారెడ్డి సైతం వైసీపీతో టచ్‌లో ఉన్నారనే సమాచారం కొనసాగుతోంది. వీరు ముందడుగు వేసినట్లుగా నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతోంది. సీఎం కడప జిల్లా పర్యటనలో వీరు వైసీపీలో చేరడం దాదాపు ఖయమైనట్టే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories