Chandrababu: అమరావతిపై మాట తప్పారని చంద్రబాబు ఆరోపణ

Chandrababu: జగన్‌ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్

Rama Rao
Published on: 4 Jan 2022 4:23 PM IST
Ex CM Chandrababu Fires on Jagan Government | AP News Today
X

 జగన్‌ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్

Chandrababu: జగన్‌ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. జగన్ పాలనలో అంతా విధ్వంసమేనంటూ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు వైసీపీ హయాంలో ఏ విధంగా నష్టపోయాం, భవిష్యత్తులో ఎలా నష్టపోతామనేది ప్రజలే ఆలోచించుకోవాలన్నారు. ప్రజా వేదిక నుంచి నిన్న పల్నాడులో ఎన్టీఆర్‌ విగ్రహంపై దాడి ఘటన వరకు అన్ని అంశాలను ప్రస్తావించారు చంద్రబాబు.

అధికారంలోకి రావడంతోనే ప్రజా వేదికను కూల్చిన జగన్‌ ఇప్పటి వరకు ఆ శిథిలాలు కూడా తొలగించలేదన్నారు. మెజారిటీ అభిప్రాయం ప్రకారం గుంటూరు విజయవాడ మధ్య రాజధాని పెట్టామన్నారు. పోలవరం నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ పరిహారం కూడా ఇవ్వలేకపోయారని విమర్శించారు. పోలవరం పై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ఉందా అంటూ చంద్రబాబు సవాల్ విసిరారు.

Rama Rao

Rama Rao

Next Story