తిరుపతికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

Kiran Kumar Reddy: ఇటీవలే ఢిల్లీలో సోనియా గాంధీని కలిసొచ్చిన కిరణ్ కుమార్

Rama Rao
Published on: 27 May 2022 10:52 AM IST
Ex AP CM Nallari Kiran Kumar Reddy to Tirupati | Telugu News
X

తిరుపతికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

Kiran Kumar Reddy: ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తిరుపతికి చేరుకున్నారు. కొంతకాలంగా రాజకీయంలో నిస్తేజంగా ఉన్న ఆయన ఈ మధ్యే పొలిటికల్ రీ ఎంట్రీ ఇచ్చారు. అదేవిధంగా ఢిల్లీలో సోనియాగాంధీని కలిసి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఏపీలో కాంగ్రెస్‌ పార్టీకి ఊపు తేగల నాయకుడని అధిష్టానం విశ్వసిస్తోందని పార్టీ పెద్దలు ఆయనకు సముచిత స్థానమిచ్చి ప్రోత్సహించబోతున్నారని పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు చెబుతున్నారు. ఢిల్లీలో సోనియాను కలిసిన తర్వాత తొలిసారిగా సొంత జిల్లాకు వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు, అభిమానులు రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు.

Rama Rao

Rama Rao

Next Story