ఈవెంట్ డాన్సర్ ఆత్మహత్యకు కారణం అదేనా?

X
Highlights
విజయవాడ వాంబే కాలనీలో గాయత్రి అనే ఈవెంట్ డాన్సర్ ఆత్మ హత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఆత్మహత్యకుముందు నీలిమ...
Arun Chilukuri19 Dec 2020 11:56 AM GMT
విజయవాడ వాంబే కాలనీలో గాయత్రి అనే ఈవెంట్ డాన్సర్ ఆత్మ హత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఆత్మహత్యకుముందు నీలిమ అనే స్నేహితురాలు ఇంటికొచ్చినట్లు గాయత్రితో ఘర్షణ పడినట్లు స్థానికులు చెబుతున్నారు. నీలిమ వెళ్లిపోయిన తర్వాత ఇంట్లోనే చీర కొంగుతో ఫ్యాన్ కు గాయత్రి ఉరి వేసుకుంది. ఆసమయంలో ఆమె భర్త సురేష్ , పిల్లలు బయటకు వెళ్లారు. గాయత్రి మృతిపై భర్త సురేష్ ఇతర కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాయత్రితో గొడవ పడిన నీలిమను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Web Titleevent dancer Suspicious death in Vijayawada
Next Story