Pendurthi: ప్రోవైడ్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ

Swathi Adulapuram
Updated on: 25 April 2020 10:04 PM IST
Pendurthi: ప్రోవైడ్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ
X

పెందుర్తి: ప్రొవైడ్స్ చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ షేక్ జావేద్ అక్తర్ ఆర్థిక సహాయంతో పెందుర్తి మండలంలో గల నిరుపేద ముస్లింలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. చిన్నముసిడివాడ మసీదులో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 150 మందికి బియ్యం, గోధుమలు, కాయగూరలును ముస్లిం పెద్దలు షేక్ మౌలా, మహమ్మద్ అత్తార్, షేక్ జావేద్ అక్తర్ చేతులమీదుగా డిజైన్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగ షేక్ జావిద్ మాట్లాడుతూ... ప్రస్తుత పరిస్థితుల్లో పని లేక పేద ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న వారికి తమ వంతు సహకారాన్ని అందించినట్లు తెలిపారు. మరికొన్ని ప్రాంతాల్లో కూడా ట్రస్టు తరఫున సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. షేక్ మౌలా మాట్లాడుతూ... పేదల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ ట్రస్ట్ వారు సహాయం అందించడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నముసిడివాడ మసీదు ప్రెసిడెంట్ గృహం బ్రూహన్, పోసంశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Swathi Adulapuram

Swathi Adulapuram

Next Story