Atchannaidu ESI Scam Case Updates: మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి మరోసారి చుక్కెదురు

Atchannaidu ESI Scam Case Updates: టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు కోర్టులో...
Atchannaidu ESI Scam Case Updates: టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు కోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఈఎస్‌ఐ కుంభకోణంలో అరెస్టయిన అచ్చెన్నాయుడుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు బెయిల్ నిరాకరించింది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను ఏసీబీ ప్రత్యేక కోర్టు మరోసారి కొట్టివేసింది. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని అచ్చెన్నాయుడు గతంలో కూడా ఏసీబీ కోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా కోర్టు కొట్టివేసింది. కాగా గత ఆరేళ్లలో ఈఎస్‌ఐలో కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని నిర్ధారించారు. ఈఎస్‌ఐ లేని కంపెనీలు నుంచి నకిలీ కొటేషన్లు తీసుకుని ఆర్డర్లు ఇచ్చినట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ గుర్తించింది. దాంతో ఈ కేసును ఏసీబీ బదిలీ చేసింది.
ఈ కేసులో మాజీ మంత్రి అచ్చెనాయుడు సహా పది మంది ఈ కేసులో అరెస్టైన విషయం అందరికి తెలిసిందే. ఈ కుంభకోణానికి సంబంధించి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పాత్ర ఉందని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తులో గుర్తించారు. నామినేషన్ పద్దతిలో అచ్చెన్నాయుడు టెండర్లు ఇప్పించారని రిపోర్ట్‌లో అధికారులు ప్రస్తావించారు. టెలీ హెల్త్ సర్వీసుల పేరుతో ఆర్డర్స్ ఇవ్వడంలో అచ్చెన్నాయుడు ఒత్తిడి చేశారని ఏసీబీ ఆరోపిస్తోంది. దీనిపై ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. మరోవైపు మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ప్రభుత్వం కక్షపూరితంగా ఇరికించిందని ప్రతిపక్ష టీడీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత
28 Jun 2022 7:36 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTబాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMT
Niranjan Reddy: బీజేపీ టూరిస్ట్‌లు నెల రోజులకు ఓసారి వచ్చి...
29 Jun 2022 9:26 AM GMTఅమర్నాథ్ యాత్రకు మొదటి బ్యాచ్.. యాత్రకు వెళ్లిన 3వేల మంది భక్తులు..
29 Jun 2022 9:02 AM GMTYCP Plenary: జులై 8,9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ
29 Jun 2022 8:10 AM GMTమోడీ పర్యటనలో మెగాస్టార్‌కు ఆహ్వానం .. పవన్‌కు లభించని ఇన్విటేషన్
29 Jun 2022 7:54 AM GMTవిజయ్ దేవరకొండ తో మూడో సినిమా ప్లాన్ చేస్తున్న పూరి
29 Jun 2022 7:33 AM GMT