విజయవాడలో దారుణం.. ప్రేమోన్మాది దాడిలో యువతి మృతి

Arun Chilukuri
Published on: 15 Oct 2020 2:40 PM IST
విజయవాడలో దారుణం.. ప్రేమోన్మాది దాడిలో యువతి మృతి
X

విజయవాడలో ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. తమ ప్రేమను నిరాకరించిందన్న ఆక్రోశం అక్కసుతో ప్రాణాలు తీసేందుకు కూడా లెక్కచేయటం లేదు. మొన్న ప్రేమ వేధింపులకు బలైన చిన్నారి ఘటన మరువకముందే ఇవాళ మరో యువతి కూడా ప్రేమోన్మాది చేతిలో ప్రాణాలు కోల్పోయింది.

విజయవాడకు చెందిన ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థినిని కొద్ది కాలంగా నాగేంద్ర బాబు అనే యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అయితే తన ప్రేమను దివ్య అంగీకరించకపోవటంతో ఆక్రోశంతో ఊగిపోయిన నాగేంద్ర బాబు నేరుగా ఇంటికి వెళ్లి కత్తితో దాడికి పాల్పడ్డాడు. మెడపై తీవ్రంగా గాయపరిచాడు. ప్రాణాలతో కొట్టుమిట్టాడిన యువతి చికిత్స పొందుతూ మృతి చెందింది.

ఇటీవల విజయవాడలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కొవిడ్ కేర్ సెంటర్‌‌లో నర్సుగా పనిచేస్తోన్న చిన్నారి అనే యువతిని ఓ యువకుడు ప్రేమ పేరుతో వెంటపడ్డాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే బుద్ధి మార్చుకుంటానని చెప్పి తర్వాత ఆ యువతిపై కిరోసిన్ పోసి సజీవదహనం చేశాడు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story