గణేశ్‌ మండపాలకు ఎలాంటి రుసుం లేదు: దేవాదాయశాఖ కమిషనర్

Ganesh Chaturthi: వినాయక చవితి మండపాల ఏర్పాటుకు ఎటువంటి రుసుములు వసూలు చేయడం లేదని దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ తెలిపారు.

Arun Chilukuri
Published on: 28 Aug 2022 7:09 PM IST
Endowments Commissioner Denies Collection of Fee for Vinayaka Mandapams
X

గణేశ్‌ మండపాలకు ఎలాంటి రుసుం లేదు: దేవాదాయశాఖ కమిషనర్

Ganesh Chaturthi: వినాయక చవితి మండపాల ఏర్పాటుకు ఎటువంటి రుసుములు వసూలు చేయడం లేదని దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ తెలిపారు. రుసుం వసూలు చేస్తున్నారని దుష్ప్రచారం జరుగుతోందన్నారు. సంబంధిత మండపాలు ఏర్పాటు చేసుకునేందుకు స్థానిక పోలీసు, రెవెన్యూ అధికారులను సంప్రదించాలన్నారు. మండపాలకు రుసం వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రుసుము వసూలు చేస్తున్నారని ఆరోపణలు ప్రచారం చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇటువంటి అబద్ధపు నిరాధార ప్రచారాన్ని ప్రజలు భక్తులు నమ్మవద్దని వినాయక చవితి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని దేవాదాయ శాఖ కమిషనర్ అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story