హత్యతో తనకు సంబంధం ఉంటే బహిరంగ ఉరికి సిద్ధం : ఆదినారాయణరెడ్డి

హత్యతో తనకు సంబంధం ఉంటే బహిరంగ ఉరికి సిద్ధం : ఆదినారాయణరెడ్డి
x
ఆదినారాయణరెడ్డి
Highlights

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో .01 శాతం తన పాత్ర ఉన్నా పులివెందుల నడిబొడ్డున ఉరి తీసుకుంటానని.. నాది తప్పుంటే ఎన్‌కౌంటర్‌ చేసుకోవచ్చని...

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో .01 శాతం తన పాత్ర ఉన్నా పులివెందుల నడిబొడ్డున ఉరి తీసుకుంటానని.. నాది తప్పుంటే ఎన్‌కౌంటర్‌ చేసుకోవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆదినారాయణరెడ్డి. వివేకా హత్య కేసులో రేపు సిట్ విచారణకు హాజరవుతానని ఆయన పేర్కొన్నారు.

తాను అజ్ఞాతంలోకి వెళ్లాననడం తగదని, తనకు ఈ రోజే సిట్ నోటీసులు అందాయని చెప్పారు. వివేకా హత్య కేసులో తన పాత్ర లేదని, ఉందని ఎవరైనా నిరూపిస్తే ఉరి తీసుకుంటానని, ఆరోపణలు చేసేవారు నిరూపించలేకపోతే వాళ్లు ఏమి చేసుకుంటారో మీడియా ముఖంగా చెప్పాలని డిమాండ్ చేశారు. వివేకా హత్య కేసుపై ముందుగా సీబీఐ విచారణ కోరి, ఇప్పుడు వాళ్ల అనుకూలం కోసమే సిట్ విచారణ అంటున్నారని ఆదినారాయణరెడ్డి మండిపడ్డారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories