Eluru: అమెరికాలో కాల్పులు.. ఏలూరు యువకుడు మృతి

Eluru: క్లీవ్ లాండ్‌ యూనివర్శిటీలో MS చదువుతున్న సాయేష్‌

Jyothi
Published on: 21 April 2023 11:16 AM IST
Eluru Student Shot Dead In USA
X

Eluru: అమెరికాలో కాల్పులు.. ఏలూరు యువకుడు మృతి

Eluru: అమెరికాలో జరిగిన దుండగుల కాల్పుల్లో ఏలూరుకు చెందిన తెలుగు యువకుడు మృతి చెందాడు. గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్‌లో పార్ట్‌ టైమ్‌ ఉద్యోగం చేస్తున్న సాయేష్‌ను.. విధుల్లో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చారు. రెండేళ్ల క్రితం సాయేష్‌ తండ్రి మరణించగా.. తండ్రి కోరికతో అమెరికా వెళ్లాడు. అక్కడి క్లీవ్ లాండ్‌ యూనివర్శిటీలో MS చదువుతున్న సాయేష్‌.. 2నెలల్లో చదువు పూర్తి కానుండటంతో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న కొడుకు మృతి చెందడంతో.. ఆ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.

Jyothi

Jyothi

Next Story