చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో ఏనుగులు హల్‌చల్
* ముసలిమడుగు వద్ద ఏనుగులు సంచారం.. గుడియత్తం రోడ్డుపై ఏనుగుల గుంపు మకాం
చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో ఏనుగులు హల్‌చల్
Elephants Hulchul: చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలంలో ఏనుగులు గుంపు హల్‌చల్ చేస్తోంది. ముసలిమడుగు వద్ద 22 ఏనుగులు ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. అడవులో నుంచి రోడ్డుపై సంచరిస్తూ హల్‌చల్ చేశాయి. దీంతో రోడ్డుపై రాకపోకలు స్తంభించాయి. గుడియాత్తం వెళ్ళే మార్గంలో సుమారు అరగంటకుపైగా ఏనుగులు తిష్టవేశాయి. ఏనుగుల గుంపు వచ్చినట్లు తెలుసుకున్న స్థానికులు, ప్రజలు వాటిని అడవుల్లోకి మళ్ళించడం కోసం అరుపు కేకలు వేస్తూ తరిమే ప్రయత్నం చేసారు. ఇటీవల ఈ గుంపు తమ గ్రామంలోని వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. అటవీశాఖ వాటిని మళ్లించే ప్రయత్నం చేయాలని ప్రజలు వేడుకుంటున్నారు.
Next Story




