చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో ఏనుగుల గుంపు బీభత్సం

*వ్యవసాయ పంటలను ధ్వంసం చేసిన ఏనుగులు

Rama Rao
Published on: 3 Oct 2022 12:57 PM IST
Elephants Destroying Crop Fields in Chittoor
X

చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో ఏనుగుల గుంపు బీభత్సం

Chittoor: చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో గజరాజులు హల్చల్ చేస్తున్నాయి. పంట పొలాలను ధ్వంసం చేస్తూ ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తోంది. ఏనుగుల దాడిలో వరి, అరటి, బీన్స్ పంటలు నాశనం అయ్యాయని రైతులు వాపోతున్నారు. గత వారం రోజులుగా మండలంలో ఏనుగులు సంచరిస్తున్నాయి. దీంతో సమీప గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు స్పందించి ఏనుగుల నుంచి తమను, తమ పంట పొలాలను కాపాడాలని కోరుతున్నారు.

Rama Rao

Rama Rao

Next Story