గజరాజు బీభత్సం.. బస్సు అద్దాలు ధ్వంసం చేసి హల్‌చల్

Elephant: రహదారిపై బస్సును ధ్వంసం చేసిన ఒంటరి ఏనుగు

Jyothi
Published on: 4 Sept 2023 12:52 PM IST
Elephant Hulchul In Parvathipuram Manyam District
X

గజరాజు బీభత్సం.. బస్సు అద్దాలు ధ్వంసం చేసి హల్‌చల్

Elephant: పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించింది. కొమరాడ మండలం అర్ధాం గ్రామంలోని రహదారిపై బస్సును ధ్వంసం చేసింది. అంతర్రాష్ట్ర రహదారిపై వెళ్తున్న బస్సును అడ్డగించిన గజరాజు తన ప్రతాపాన్ని చూపించింది. బస్సు అద్దాలు ధ్వంసం చేసి రోడ్డుపై హల్ చల్ చేసింది. రహదారిపైనే తిష్ట వేసి వాహనదారులను భయభ్రాంతులకు గురిచేసింది. దీంతో రహదారికి ఇరువైపులా వాహనాలు, ట్రాఫిక్ స్తంభించిపోయింది. మరో వైపు ఏనుగును అడవిలోకి తరిమేందుకు వాహనదారులు ప్రయత్నిచండంతో వారిపైకి తిరగబడింది. ప్రయాణికులు కూడా చేసేదేం లేక పరుగులు పెట్టారు.

Jyothi

Jyothi

Next Story