AP Electricity Employees Strike: ఏపీలో విద్యుత్ ఉద్యోగులు సమ్మె సైరన్.. ఎప్పుడంటే..?

AP Electricity Employees Strike: రేపటి నుంచి పవర్ గ్రిడ్ ఉద్యోగులు విధుల్లోకి రావాలని విజ్ఞప్తి

Shekhar G
Published on: 9 Aug 2023 10:45 AM IST
Electricity Workers Strike In AP From Tomorrow
X

AP Electricity Employees Strike: ఏపీలో విద్యుత్ ఉద్యోగులు సమ్మె సైరన్.. ఎప్పుడంటే..?

AP Electricity Employees Strike: ఏపీలో విద్యుత్‌ ఉద్యోగుల సమ్మె సైరన్ మోగించారు. నేటి అర్ధరాత్రి నుంచి విద్యుత్ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగనున్నారు. అయితే.. సమ్మెను వారంపాటు వాయిదా వేసుకోవాలని యాజమాన్యం కోరింది. మంత్రివర్గ ఉపసంఘంతో చర్చిద్దామని ఉద్యోగ సంఘాలకు వెల్లడించింది. సీఎం జగన్‌తో చర్చించాక తుది నిర్ణయం ప్రకటిస్తామని తెలిపింది. దీనికి ససేమిరా అంటున్న విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ.. వాయిదా కుదరదని తేల్చిచెప్పింది. ఇవాళ యాజమాన్యానికి సిమ్‌కార్డ్‌లను సైతం హ్యాండోవర్ చేయనున్నారు ఉద్యోగులు. దీంతో.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది యాజమాన్యం. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఉద్యోగులను రంగంలోకి దించాలని యోచిస్తోంది. రేపటి నుంచి పవర్ గ్రిడ్ ఉద్యోగులు విధుల్లోకి రావాలని విజ్ఞప్తి చేసింది.

Shekhar G

Shekhar G

Next Story