అనంతపురం జిల్లాలో మరోసారి తెగిపడ్డ విద్యుత్ తీగలు..!
* విడపనకల్లు మండలం పాల్తూరులో తప్పిన ప్రమాదం
అనంతపురం జిల్లాలో మరోసారి తెగిపడ్డ విద్యుత్ తీగలు
Electric Accident: అనంతపురం జిల్లాలో మరోసారి విద్యుత్ తీగలు తెగిపడటం కలకలం రేపింది. విడపనకల్లు మండలం పాల్తూరులో జనం మధ్య వైర్లు తెగిపడ్డాయి. స్థానికులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. దుర్గా హోనూరు ఘటన మరువకముందే మరోసారి వైర్లు తెగిపడటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరెంటు వైర్లు ఎక్కడికక్కడే తెగిపడుతున్నా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Next Story




