Home > ఆంధ్రప్రదేశ్ > Election Commission Releases Notification: ఏపీలో ఎమ్మెల్సీ స్థానం భర్తీకి ఈసీ షెడ్యూల్
Election Commission Releases Notification: ఏపీలో ఎమ్మెల్సీ స్థానం భర్తీకి ఈసీ షెడ్యూల్

X
Highlights
Election Commission Releases Notification: ఏపీలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికకు...
Arun Chilukuri30 July 2020 10:15 AM GMT
Election Commission Releases Notification: ఏపీలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. సీఎం జగన్ సూచనలతో వెంకట రమణ ఎమ్మెల్సీ, మంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం రాజ్యసభకు పోటీ చేయించడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆగస్టు 6న నోటిఫికేషన్ విడుదల, 13న నామినేషన్ దాఖలు, ఆగస్టు 24న పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఎమ్మెల్సీ పదవికోసం వైసీపీలోని పలువురు ఆశావహులు పోటీపడుతున్నారు.
Web TitleElection Commission releases notification for by-elections of vacant MLC posts in Andhra Pradesh
Next Story