ఏపీలో సంక్షేమ పథకాలకు ఎన్నికల కోడ్‌: సీఎస్‌కు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ సర్క్యులర్..

ఏపీలో సంక్షేమ పథకాలకు ఎన్నికల కోడ్‌: సీఎస్‌కు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ సర్క్యులర్..
x
Highlights

ఏపీలో సంక్షేమ పథకాలకు ఎన్నికల కోడ్‌ వర్తించనుంది. సంక్షేమ పథకాలను నిలిపివేయాలని ఎన్నికల సంఘం సూచించింది. ఏపీ సీఎస్‌కు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ సర్క్యులర్...

ఏపీలో సంక్షేమ పథకాలకు ఎన్నికల కోడ్‌ వర్తించనుంది. సంక్షేమ పథకాలను నిలిపివేయాలని ఎన్నికల సంఘం సూచించింది. ఏపీ సీఎస్‌కు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ సర్క్యులర్ జారీ చేశారు. ఎస్‌ఈసీ ఆదేశాలతో అమ్మఒడి, ఇళ్ల స్థలాల పంపిణీ ఆగిపోనున్నాయి. ఎస్‌ఈసీ ఆదేశాలు బడ్జెట్‌పై కూడా ప్రభావం చూపే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు పంచాయతీలకు సంబంధించినవి కావడంతో ఎన్నికల కోడ్ గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుందని ఎన్నికల సంఘం ఆ లేఖలో స్పష్టత నిచ్చింది. పట్టణ, నగర ప్రాంతాల్లో ప్రవర్తన నియమావళి అమలులో ఉండదని తెలిపింది. అయితే, గ్రామీణ ప్రజలకు లబ్ది చేకూర్చేందుకు పట్టణ ప్రాంతాల్లో సభలు ఏర్పాటు చేయడం నియమావళికి విరుద్ధమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories