CM Jagan: 28 నుంచి సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం

CM Jagan: తాడిపత్రిలో ఉదయం సభతో ప్రచారానికి శ్రీకారం

Shashank Gullapelli
Published on: 26 April 2024 10:30 AM IST
Election Campaign Of CM Jagan From 28
X

CM Jagan: 28 నుంచి సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారంc  

CM Jagan: మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఈనెల 28 నుంచి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచార భేరి మోగించనున్నారు. ప్రతి రోజూ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభలలో పాల్గొంటారు. ఈనెల 28న ఆదివారం ఉదయం పది గంటలకు తాడిపత్రిలో నిర్వహించే బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.

అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు వెంకటగిరిలో, 3 గంటలకు కందుకూరులో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఈనెల 28వతేదీ నుంచి మే 1 వరకు సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం విడుదల చేసింది. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి ఒక రోజు ముందు అంటే 27న వైఎస్సార్‌సీపీ ఎన్నికల మేనిఫెస్టోను జగన్‌ విడుదల చేయనున్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story