ఏపీలో జోరుగా ఎన్నికల ప్రచారం.. బస్సు యాత్రతో బిజీగా ఉన్న వైసీపీ బాస్ జగన్.. అటు పార్టీలోకి చేరికలపై కూడా ఫోకస్..

AP News: టికెట్లు ఆశించి భంగపడిన లీడర్లు టార్గెట్‌గా చర్చలు

Jyothi
Published on: 3 April 2024 9:01 AM IST
Election Campaign in Andhra Pradesh
X

ఏపీలో జోరుగా ఎన్నికల ప్రచారం.. బస్సు యాత్రతో బిజీగా ఉన్న వైసీపీ బాస్ జగన్.. అటు పార్టీలోకి చేరికలపై కూడా ఫోకస్.. 

AP News: ఏపీలో ఎన్నికల యాత్రలు జోరుగా కొనసాగుతున్నాయి. ఓ వైపు బస్సు యాత్రతో బిజీగా ఉన్న వైసీపీ బాస్ జగన్.. అటు పార్టీలోకి చేరికలపై కూడా ఫోకస్ పెట్టారు. కూటమిలోని అసంతృప్త నేతలపై దృష్టి పెట్టి పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారు. రాష్ట్రంలోని అసెంబ్లీ స్థానాలకు అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. అటు కూటమి పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్థులు ఖరారు అయ్యారు. అయితే టికెట్లు ఆశించి భంగపడిన నేతలపై వైసీపీ ఫోకస్ పెట్టింది. ఎక్కడ ఎలాంటి ఛాయిస్ దొరికినా ఆయా నేతలకు ఆహ్వానం పలుకుతున్నారు.

ఇప్పటికే కొనసాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్రలో పలువురు నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ముమ్మడివరం జనసేన ఇన్‌చార్జ్ పితాని బాలకృష్ణ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇక కళ్యాణదుర్గం టీడీపీ ఇన్‌చార్జ్ కూడా ఆయన అనుచరులతో కలిసి ఫ్యాన్ పార్టీలో జాయిన్ అయ్యారు. మరో వైపు కూటమిలోని అసంతృప్తులు నియోజకవర్గాల వారీగా వైసీపీలోకి చేరుతారని ఆ పార్టీవర్గాలు చెబుతున్నాయి.

Jyothi

Jyothi

Next Story