Delhi Liquor Scam Case: ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ నోటీసులు

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఈడీ దూకుడు పెంచింది.

Arun Chilukuri
Published on: 16 March 2023 3:24 PM IST
ED Notice To MP Magunta Sreenivasulu Reddy
X

Delhi Liquor Scam Case: ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ నోటీసులు

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 18న తమ ముందు విచారణకు హాజరుకావాలని మాగుంటను ఆదేశించింది. మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో అరుణ్ పిళ్లై కస్టడీ పొడిగించారు. మరో మూడ్రోజుల పాటు ఈడీ కస్టడీ పొడిగిస్తూ స్పెషల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కవిత ఈరోజు విచారణకు రాలేదని ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు. అందర్నీ కలిపి విచారించాలనుకున్నామని.. కానీ కవిత ప్రతినిధి డాక్యుమెంట్లు ఇచ్చారని తెలిపారు. అయితే అందర్నీ కలిపి విచారించాల్సి అవసరం ఏముందని స్పెషల్ కోర్టు ప్రశ్నించింది. కొన్ని డాక్యుమెంట్ల ద్వారా కూడా విచారించవచ్చని తెలిపింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story